ఏసీబీ అధికారులకు చిక్కిన ఫారెస్ట్ రేంజ్ డిప్యూటీ ఆఫీసర్ జయప్రకాష్

మచిలీపట్నంలో ఏసీబీ అధికారులు దాడులు..పట్టుపడ్డ అవినీతి తిమింగలం..

గోల్డెన్ న్యూస్ / మచిలీపట్నం : కృష్ణాజిల్లా అటవీ శాఖ  మచిలీపట్నం కార్యాలయంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్న జయప్రకాష్ మంగళవారం 18 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు..

పట్టుబడ్డ ఉద్యోగులపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు..

ఏసీబీ డీఎస్పీ పివి సుబ్బారావు ఆధ్వర్యంలో మచిలీపట్నం అటవీశాఖ కార్యాలయంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పై ఏసీబీ రైడ్ నిర్వహించారు.

ఎంవిఎస్ నాగరాజు ఇతర ఉన్నతాధికారులు ఈ రైడ్ లో పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram