భద్రాచలంలో యువకుడు దారుణ హత్య

గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం పట్టణంలోని యువకుల మధ్య తలెత్తిన వివాదం ఒక యువకుని ప్రాణాన్ని తీసింది. స్థానికుల వివరాల ప్రకారం. భద్రాచల పట్టణం ఏ ఎస్ ఆర్ కాలనీకి చెందిన సతీష్ (24) అనే యువకుడుని జగదీష్ కాలనీకి చెందిన యువకులు అతి కిరాతకంగా హత్య చేశారు. రెండు వర్గాల మధ్య పాత కక్షల నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఛత్తీస్ ఘడ్ వలస కూలీలను సరఫరా చేసే ముఠా సభ్యుల మధ్య గొడవ తలెత్తింది తర్వాత అంతా సర్దుకుని ఎవరి ఇంటికి వారు వెళ్లడం జరిగింది. కానీ గొడవ పడిన వారిలో కొంతమంది తెల్లవారుజామున  కణితి సతీష్ ఇంటికి వచ్చి ఇంట్లోనే దారుణంగా కొట్టి అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి హత్యకు పాల్పడ్డారు.  గమనించిన చుట్టుపక్కల వారు సతీష్ ని  ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే సతీష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు కేసు నమోరు చేసి విచారణ చేపట్టినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. భద్రాచలం టౌన్ సీఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram