తీరని ఆదివాసీ, గిరిజనుల డోలి కష్టాలు

     అడవి బిడ్డకు ప్రసవ వేదన.

గోల్డెన్ న్యూస్/ పినపాక : రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ, గిరిజనుల డోలి కష్టాలు తీరట్లేదు. జిల్లాల విభజన జరిగి పరిపాలన చేరువైనా.. సరైన రవాణా సదుపాయాలు లేక ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తుండటం గిరిజనులపాలిట శాపంగా మారింది. రహదారి సౌకర్యం లేక డోలీలతోనే గర్భిణులను తీసుకెళ్తున్నారు. కొన్ని చోట్ల ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిందే. అలాంటి సంఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం చోటుచేసుకుంది. టీ కొత్తగూడం గ్రామపంచాయతీ పరిధిలోని ఉమేష్ చంద్ర నగర్ గ్రామానికి చెందిన మీడియం సన్ను భార్య జానకి కి  ఆదివారం పురిటి నొప్పులు  రాగా రహదారి సౌకర్యం లేకపోవడంతో నడవలేని స్థితిలో ఉన్న నిండు చూలాల గర్భిణీ ని జడ్డీ  కట్టుకొని మోసుకొని పోవాల్సిన పరిస్థితి  ఏర్పడింది.గర్భిణిని జడ్డిలో పడుకోబెట్టి వందల మీటర్ల దూరం మోసుకెళ్లారు. అనంతరం జానంపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఆమెను తరలించా రు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. గ్రామానికి కనీస రహదారి కూడా లేకపోవడం వల్ల అంబులెన్స్ సేవలు అందుబాటులోకి రాకపోవ డమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్తులే భుజాలపై బాధ్యత మోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పాలకులు, అధికారులు మారిన  తమ గ్రామం అభివృద్ధి జరగట్లేదు అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .తెలంగాణ రాష్ట్రంలో నేటికీ పలు గ్రామాలు అభివృద్ధి కి నోచుకోలేదని. రహదారులు లేక జడ్డి కష్టాలు తీరడం లేదని  తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు మడివి రమేష్ అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు  మారుమూల గిరిజన గ్రామాల కు మౌలిక వసతులు, రహదారులు ఏర్పాటు చేసి ఆదివాసి బ్రతుకులను మార్చాలని కోరారు..

Facebook
WhatsApp
Twitter
Telegram