పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు అందుకున్న కొత్తగూడెం త్రీటౌన్ సిఐ శివప్రసాద్

 సిఐ శివప్రసాద్ ను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్..

గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం :  హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 2 వ తేదీన జరిగిన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డును కొత్తగూడెం త్రీ టౌన్ సీఐ శివప్రసాద్ అందుకున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తమ కార్యాలయంలో సోమవారం ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందుకుగాను సీఐ శివప్రసాద్ ఈ అవార్డును దక్కిందని ఈ అవార్డు జిల్లాకు గర్వకారణం అన్నారు.పోలీస్ శాఖలో క్రమశిక్షణ,నిబద్ధతతో పనిచేసే అధికారులు,సిబ్బందికి ఎప్పటికైనా ప్రత్యేక గుర్తింపు,గౌరవం లభిస్తుందని  ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram