వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన సుదర్శన్ రెడ్డి అభిమానులు.
గోల్డెన్ న్యూస్ /బోధన్ : బోధన్ పట్టణంలోని బీటి నగర్ లో మంగళవారం కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనలు తెలిపారు. సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలని లేదంటే వాటర్ ట్యాంక్ పైన నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నచ్చ చెప్పడంతో వారు ట్యాంక్ పై నుంచి కిందకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో నవీన్ తలారి, హైమద్, జునేద్,నాసిర్, ఉమేష్, హర్షద్ లు పాల్గొన్నారు.
Post Views: 40