నిరుద్యోగులకు మణుగూరులో జాబ్ మేళా నిర్వహించాలి 

హైదరాబాదులో జిఎం కోఆర్డినేషన్ యస్ డి మహబూబ్ సుభాని ఆపరేటర్ల వినతి పత్రం అందజేత.

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : నిరుద్యోగుల ఉపాధి కొరకు మణుగూరు సింగరేణి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించాలని, ఈపీ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలని.హైదరా బాద్ సింగరేణి భవన్ లో మంగళవారం నాడు జిఎం కో-ఆర్డినేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ యస్ డి మహబూబ్ సుభానికి వినతి పత్రం అందజేసినట్లు గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ డి నా సర్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో గోదావరిఖని మరియు వైరాలలో నిర్వహించిన జాబ్ మేళా అనేకమంది నిరుద్యోగులకు ఉపాధి దొరికిందని భూ నిర్వాసితులకు, సింగరేణి డిపెండెంట్ లకు మరియు స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మణుగూరు లో కూడా జాబ్ మేళా నిర్వహించాలని  సింగరేణి సిఎండి బలరాం  స్పందించాలని కోరారు అదేవిధంగా గోదావరిఖని,శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, భూపాలపల్లి ఇలా ఇతర సుదూర ప్రాంతాలకు చెందిన అనేకమంది ఆపరేటర్లు మణుగూరు ఏరియా ఓసి గనులలో పనిచేస్తున్నారని వారి కుటుంబాలు తల్లిదండ్రులు భార్య పిల్లలు అక్కడే స్థానికంగా ఉండటంతో వీరు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయా ప్రాంతాల నుండి మణుగూరు తరచూ రాకపోకల కొనసాగించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు గైర్హాజరు కావాల్సి వస్తోందన్నారు. దీని ప్రభావం ఉత్పత్తిపై కూడా పడుతోందని వారి స్వగ్రామాలకు బదిలీ చేయాలని అనేకమంది యాజమాన్యానికి దరఖాస్తు కూడా చేసుకున్నారని దీనికి పరిష్కారం మార్గంగా మణుగూరుకు చెందిన అనేకమంది డిపెండెంట్ లు ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్నారనీ. ఇందులో అనేకమందికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తగు అర్హతలు ఉన్నవారు కూడా ఉన్నారని  హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారు కూడా ఉన్నారనీ. ఆసక్తిగల వారి నుండి దరఖాస్తులను స్వీకరించి ఆపరేటర్లుగా వీరికి టిటిసి లో శిక్షణ ఇప్పించి మణుగూరు లోనే పోస్టింగ్ ఇవ్వడం ద్వారా ఆపరేటర్ల కొరత సమస్య పరిష్కారం అవుతుందన్నారు. వీరు,వారు కూడా తమ స్వ స్థలాలలో తమ తల్లిదండ్రులతో భార్యాపిల్లలతో ఉండే అవకాశం కూడా ఉంటుందనీ తాము చేస్తున్న ఈ సూచన పట్ల సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించారని కోరారు. అలాగే ఆపరేటర్ల సూటబుల్ జాబ్, ప్రమోషన్ పాలసీ అమలు తదితర సమస్యలపై కూడా యాజమాన్యం స్పందించి పరిశీలించాలని కోరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram