రెవిన్యూ సదస్సు ఆకస్మిక తనిఖీ.. దరఖాస్తులు పరిశీలించిన జెసి

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మోతే గ్రామంలో రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.మంగళవారం మోతే గ్రామంలో ఇంచార్జ్ తాసిల్దార్ తహసీల్దార్ వి కాంతయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుకు ఆకస్మికంగా వచ్చిన జాయింట్ కలెక్టర్, హౌసింగ్ పీడీ శంకర్ అక్కడున్న ప్రజలను ఏ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారని అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ వద్ద ఉన్న వివరాలు సేకరించి ప్రజలతో అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు.

Facebook
WhatsApp
Twitter
Telegram