గోల్డెన్ న్యూస్/కరకగూడెం : అక్రమంగా నిల్వ చేసిన బెల్లం, పటికను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మణుగూరు ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. కరకగూడెంమండల పరిధిలోని పలు గ్రామాల్లో అక్రమంగా బెల్లం రవాణా, నిల్వ చేయడంతోపాటు గుడుంబా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు గురువారం ఎక్సైజ్ ఆధ్వర్యంలో కరకగూడెం ఎస్ఐ పివి నాగేశ్వరరావు తన సిబ్బందితో కలిసి కల్వలనాగారం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుడుంబ(నాటుసార) స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. దాడుల్లో ఒకరి ఇంట్లో నిల్వచేసిన 15 క్వింటాళ్ల బెల్లం,10 కిలోల పటిక,10 పది లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అక్రమంగా గుడుంబా తయారీ సామాగ్రిని నిలువచేసిన వ్యక్తి కునుసోత్ సాగర్ పై కేసు నమోదు చేసినట్లు మణుగూరు ఎక్సైజ్ సిఐ తెలిపారు. పట్టుబడిన బెల్లం, పట్టిక, నాటుసారా ను మణుగూరు లోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. నిషేధిత నల్ల బెల్లం, పటిక,నాటుసార అమ్మిన కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుమటామని ఎక్సైజ్ సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 32