వారంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్- మంత్రి సీతక్క
గోల్డెన్ న్యూస్ / మహబూబాబాద్ : స్థానిక ఎన్నికలపై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న సీతక్క ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. రెండు మూడు రోజుల్లో రైతులకు రైతు భరోసా డబ్బులిస్తామని చెప్పారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. నోటిఫికేషన్ వచ్చిన నెలరోజుల లోపే ఎన్నికలను పూర్తి చేసేలా ఆలోచన చేస్తోంది గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు గతేడాది ఫిబ్రవరిలోనే ముగియగా దాదాపు ఏడాదిన్నర సర్పంచులు లేరు. ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ లాంటి పదవులు దక్కితే పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రె స్ పెద్దలు భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో.. జులైలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.