పేకాట స్థావరంపై పోలీసుల దాడి

గోల్డెన్ న్యూస్/పినపాక : పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఏడుల్ల బయ్యారం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలం పరిధిలోని టి కొత్తగూడెం గ్రామ సమీపంలో కొంతమంది పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మణుగూరు డి.ఎస్.పి రవీందర్ రెడ్డి, ఏడూళ్ల బయ్యారం  సీఐ వెంకటేశ్వర్లు, ఆదేశాలతో ఎస్సై రాజ్ కుమార్ తన సిబ్బందితో కలిసి  పేకాట స్థావరంపై దాడి చేశారు. అక్కడ పేకాడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టుచేసి వారి నుంచి రూ.5,100 నగదు,5 ద్విచక్ర వాహనాలు, ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సె తెలిపారు.మరో నలుగురు వ్యక్తులు పారిపోయినట్లు  తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram