గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం: ప్రకృతిపై చాలామందికి ప్రేమ ఉంటుంది. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం శ్రమిస్తారు కూడా. కానీ కొంతమంది మాత్రమే ప్రకృతి రక్షణ కోసం సాహసాలు చేస్తారు. అలాంటి వ్యక్తే కుంజ రాజ్ కుమార్. ప్రజల్లో పర్యావరణ రక్షణపై అవగాహన కల్పించేందుకు సైకిల్ యాత్ర చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలానికి చెందిన కుంజా రాజ్ కుమార్ డిగ్రీ చదివిన మొదటినుంచి ప్రకృతి ప్రేమికుడు. అందువల్లే ప్రజల్లో ఆరోగ్యం, ప్రకృతిపై అవగాహన కల్పిస్తున్నారు. 2025 ఏప్రిల్ లో చెట్లు నాటే కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 3000 కి.మీ సైకిల్ పై ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,రాష్ట్రాలలో సైకిల్ పై యాత్ర చేస్తూ యాత్రలో భాగంగా శుక్రవారం కరకగూడెం మండలం చేరుకున్నారు ఈ సందర్భంగా పర్యావరణ, వృక్ష సంరక్షణ పై అవగాహన కల్పించారు.యాత్రతోనే కాకుండా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రజల్లో పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. రాజ్ కుమార్ తన సొంత డబ్బులతోనే ఈ యాత్రలు చేస్తున్నారు ఆరోగ్య భారతదేశాన్ని చూడాలన్నదే తన కోరిక అని కుంజా రాజ్ కుమార్ చెప్తున్నారు.
