కొత్తగూడెం కార్పొరేషన్ లో మాదిగలకు 9% రిజర్వేషన్ అమలు చేయాలి

60 డివిజన్లలో ఖచ్చితంగా యస్.సి. వర్గీకరణ అమలు చేయాలి – 44 వేల ఓట్లు ఉన్న మాదిగలకు డిప్యూటి మేయర్ పదవిని అన్ని పార్టీలు డిక్లయర్ చేయాలి

     కొత్తగూడెం మాదిగ ఐక్యవేదిక డిమాండ్

గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం  : కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్ సమీపంలోని,పకృతి ఆశ్రమంలో దళిత సంఘం నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశం మాదిగ వనభోజనాల కన్వీనర్ చదలవాడ సూరి అధ్యక్షతన నిర్వహించారు. మాదిగల ఐక్యవేదిక కార్యక్రమంలో అన్ని మాదిగ సంఘాల నాయకులు వేల్పుల భాస్కర్, తాండ్ర వెంకటేశ్వర్లు,బొమ్మెర శ్రీనివాస్, మోదుగ జోగారావు లు పాలుగొని మాట్లాడుతూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేసి గ్రామాలను ఇష్టానుసారంగా కార్పోరేషన్ లో కలిపారని మండిపడ్డారు. ఈ కార్పొరేషన్ కుట్రపూరితమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో నలిగిపోతున్న దళిత గిరిజనుల కు పూర్తి న్యాయం జరిగేలాగా డివిజన్లో ఏర్పాటు చేయాలని సూచించారు.కొత్తగూడెం కార్పొరేషన్ లో మాదిగలకు 9% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ కొత్తగా కార్పొరేషన్ గా 60 డివిజన్ లలో ఏర్పాటు చేశారన్నారు. ఇందులో భాగంగా ఖచ్చితంగా యస్.సి. వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.కార్పొరేషన్ కు డిప్యూటి మేయర్ గా మాదిగలకు డిక్లియర్ చేయాలని ప్రభుత్వానికి తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను కోరిన మాదిగ ఐక్యవేదిక నాయకులు. ఈ కార్యక్రమంలో గడ్డం రాజశేఖర్, కనకం సూరి,కొండా జంపన్న,దూడపాక శివ, బండిపల్లి కిరణ్,కుంపటి నాగరాజు, బోట్ల శ్రీను, ఐలపొంగు సురేష్, గణిపాక సుధాకర్, దామోదర్, యస్వంత్,తదితరులు పాలుగోన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram