భారీగా నల్ల బెల్లం పట్టివేత

90 క్వింటాల నల్ల బెల్లం, 10 క్వింటాల  పటిక స్వాధీనం..

గోల్డెన్ న్యూస్/ మహబూబాబాద్ : మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అనంతారం నుండి మొగిలిచర్ల మధ్యనున్న అటవీ ప్రాంత పరిసరాలలో నాటుసారా స్థావరాలపై, బెల్లం పటిక రవాణా పై మహబూబాబాద్ ఎక్సైజ్ సిఐ చిరంజీవి ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఎస్ఐ అశోక్ సిబ్బంది దాడులు నిర్వహించారు.

ఈ..దాడుల్లో చిత్తూరు నుంచి మహబూబాబాద్ జిల్లా కు నల్లబెల్లం మరియు పటిక సారాయి తయారీ కొరకు రవాణా చేస్తున్న భారత్ బెంజ్ వ్యాన్ వాహనం, 180 బస్తాల నల్లబెల్లం 90 క్వింటాల నల్లబెల్లం, 20బస్తాలలో 10క్వింటాల పటిక, 60 లీటర్ల సారాయి, 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి సారా తయారీకి సిద్ధంగా ఉన్నటువంటి 1,000లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసారు.

 

ఈ..నేరానికి పాల్పడినటువంటి ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచగా వీరికి 14 రోజుల రిమాండ్ విదించారు.

 

సుమారు 20 లక్షల రూపాయల విలువచేసే ప్రాపర్టీ సీజ్ చేయటం జరిగింది..గుగులోత్ అశోక్  నీలం వీరన్న , .సంగు నరేష్ అదుపులోకి తీసుకున్నారు.  గత కొంత కాలంగా వీరు ముగ్గురు కలిసి ఈ అక్రమ సారాయి, బెల్లం వ్యాపారం చేస్తున్నారు. కోదాడ కు చెందిన కోనేరు మురళీ మోహన్ పరారీ లో ఉన్నారు.

 

ఈ..దాడులలో ఎక్సైజ్ సిఐ చిరంజీవి, ఎస్ఐ అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబుళ్ళు శేఖర్, షాలెంరాజ్, శ్రీనివాస్, రవి, వెంకటనర్సయ్య, సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.

 

పెద్దమొత్తంలో నల్లబెల్లం, పటిక,వ్యాన్ లను సీజ్ చేసినందుకు వరంగల్ డిప్యూటీ కమీషనర్ అంజన్ రావు, డిపిఈఓ మహబూబాబాద్ కిరణ్ లు మహబూబాబాద్ స్టేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram