గోల్డ్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం : పిడుగుపాటుకు ఓ మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మణుగూరు మండలం రేగులగండి గ్రామానికి చెందిన కుంజ జగన్ (40) శనివారం సాయంత్రం తన పొలంలో వ్యవసాయ పని ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో అడవిలో జగన్ పై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జగన్ కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. జగన్ మూర్తి వార్త విని ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Post Views: 22