మణుగూరులో జుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్.
గోల్డెన్ న్యూస్ / మణుగూరు : శనివారం తెలంగాణ రాష్ట్రంలో లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ జరిగింది. ఈ సందర్భంగా మణుగూరులో జుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. పెండింగ్ కేసులను పరిష్కరించుకోవడానికి ప్రజలు కోర్టు ప్రాంగణంలోని లీగల్ సర్వీసెస్ సంస్థలను సంప్రదించారు. ముఖ్యంగా, ఈ మెగా లోక్ అదాలత్ లో సివిల్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, ఆస్తి హక్కులకు సంబంధించిన కేసులు, అద్దె వివాదాలు, ఇతర కేసులను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జడ్జి కంభంపు సూరి రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బద్దం శ్రీనివాసరెడ్డి, మరియు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.