గోల్డెన్ న్యూస్ / ముస్తాబాద్ : విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తేర్లుమద్ది గ్రామానికి చెందిన రాజయ్య శనివారం ఇంటిని శుభ్రం చేస్తుండగా విద్యుత్ సర్వీస్ వైరు ఇంటి వరండాలోని నీటిలో పడింది. దానిని పక్కకు తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురయ్యారు కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా. పరీక్షించిన వైద్యులు రాజయ్య అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Post Views: 15