గోల్డెన్ న్యూస్ / కొత్తగూడెం : సోమవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో రాష్ట్రవ్యాప్తంగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలలో రైతులు పాల్గొననున్నారు. జిల్లా అధికారులందరూ ఆ కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నందున సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు గమనించి దరఖాస్తులు సమర్పించడానికి ఐ డి ఓ సి కార్యాలయమునకు రావద్దని కలెక్టర్ సూచించారు.
Post Views: 16