గోల్డెన్ న్యూస్ /ఖమ్మం : కూసుమంచి మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార మరియు పౌరసంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన స్వయంగా అరక పట్టి చేలో అచ్చు తోలిన అనంతరం మహిళా కూలీలతో కలిసి పత్తి గింజలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం నిమిత్తం రైతు భరోసా కార్యక్రమం కింద సోమవారం నుంచి పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. సాగులో ఉన్న ప్రతి ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Post Views: 29