అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఎన్కౌంటర్.
ముగ్గురు కీలక నేతలు మృతి.
సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల – రవి అలియాస్ ఉదయ్ మృతి.
గోల్డెన్ న్యూస్ / ఆంధ్రప్రదేశ్ : మావోయిస్టు పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. అగ్రనేతలు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో పీపుల్స్ వార్ పార్టీతో జరిపిన చర్చల కమిటీ ప్రతినిధి, మావోయిస్టు పార్టీ ఏఓబి ప్రత్యేక కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ ఆలియాస్ ఉదయ్ బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. దీంతో ఆయన ఉద్యమంలో 33 ఏళ్ల అజ్ఞాతప్రస్థానం ముగిసినట్లయింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్లో భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి మృతి చెందాడు. ఆయనతోపాటు భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
కాగా గాజర్ల రవిపై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. 33 ఏళ్ల క్రితం తన అన్న సారయ్య, అలియాస్ ఆజాద్ తో కలిసి పార్టీలో చేరగా, అన్నల బాటలోనే తన చిన్న తమ్ముడు అశోక్ సైతం మావోయిస్టు పార్టీలో చేరారు. అన్న ఆజాద్ ఎన్ కౌంటర్లో మృతిచెందాడు. ఇక తమ్ముడు అశోక్ లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిశాడు. గాజర్ల రవి భార్య జిల్లాని మేఘం సైతం ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో జరిగిన ఎన్కౌంటర్ లో గాజర్ల రవి మృతి చెందాడు.
కాగా రవితోపాటు ఎన్కౌంటర్ లో జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ , ఉన్నారు. మరో మావోయిస్టు అంజుగా గుర్తించినట్లు సమాచారం.ఎన్ కౌంటర్ నుంచి మావోయిస్టులు పరారయ్యారు. మరికొందరు మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్ కొనసాగిస్తున్నాయి..