సర్కారు బడుల్లో లక్ష దాటిన కొత్త అడ్మిషన్లు.- ఫస్ట్ క్లాసులో 55 వేలకు పైగా ప్రవేశాలు.
గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు జోరందుకున్నాయి. ఇటీవల ప్రభుత్వ బడుల బలోపేతానికి సర్కారు తీసుకున్న బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. పాఠశాలు ప్రారంభమైన వారం రోజుల్లోనే లక్షకు పైగా కొత్త అడ్మిషన్లు వచ్చాయి. కొత్త అడ్మిషన్లలో సగానికి పైగా ఒకటో తరగతిలోనే ఉన్నాయి. అయితే, ప్రైవేటు బడుల నుంచి సర్కారు స్కూళ్లకు వస్తున్న విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రారంభమైన ఐదు రోజుల్లోనే 1.17 లక్షల మంది విద్యార్థులు చేరారు అని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో ఫస్ట్ క్లాసులోనే 55,000 మందికిపైగా చేరడం విశేషం. ప్రైవేట్ పాఠశాలల నుంచి 18,000 మంది మారినట్లు తెలుస్తోంది. బడి బాట కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం అడ్మిషన్ల సంఖ్య 2 లక్షలు దాటే అవకాశముందని వేస్తున్నారు.ప్రైవేటు నుంచి సర్కారు బడుల్లోకి రావడం గమనార్హం. వీళ్లంతా కూడా రెండో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న విద్యార్థులే. ఇది సర్కారు బడులపై పేరెంట్స్ లో విశ్వాసం పెరుగుతున్నట్టు సూచిస్తుందని విద్యావేత్తలు చెబుతున్నారు.