రూ.11 లక్షల విలువైన విత్తనాలు పట్టివేత
గోల్డెన్ న్యూస్/ చండ్రుగొండ : మండలంలోని బెండాలపాడు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న సుమారు రూ.11 లక్షల75 వేలు విలువైన పత్తి, మిరప విత్తనాలు పట్టుకున్నట్లు ఏవో వినయ్ కుమార్ తెలిపారు. సుజాతనగర్ కు చెందిన ఓ డీలర్ అనుమతులు లేకుండా విత్తనాలు విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.5 వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి 105 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 1025 మిర్చి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాల విలువ సుమారు 11 లక్షల 73 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. గ్రామాలలో రైతులను మభ్యపెట్టి అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ, కానిస్టేబుల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.