గోల్డెన్ న్యూస్ / ఏటూరునాగారం : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అభయ మిత్ర కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ అనుముల శ్రీనివాస్ మాట్లాడారు.. పోక్సో చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని, 18ఏళ్ల లోపు వయసు గల పిల్లల పై వేధింపులకు పాల్పడకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలి పారు. చట్టాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రోడ్డుప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా మీ అమ నిబంధనలు, పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, బోనఫిక్స్ వంటి ఇతర మత్తుపదార్థాలకు యువత దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణతో చదివి, ఉన్నత లక్ష్యాల వైపు ముందుకు సాగాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎస్ఐ రాజకుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
