తొలి మహిళ కండక్టర్లను సన్మానించిన ఆర్టీసీ

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో తొలి మహిళా కండక్టర్లు అయిన ముగ్గురిని సంస్థ యాజమాన్యం బుధవారం సన్మానించింది. కండక్టర్‌గా 28 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదీపట్నం డిపోకు చెందిన శారదను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఎన్నో ఏళ్లుగా ప్రజా రవాణా రవాణా వ్యవస్థలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న ఈ ముగ్గురిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌ టేకింగ్స్‌ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో సత్కరించింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి, అనిత, శారద సేవలు కొనియాడుతూ టీజీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం కూడా సన్మానించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram