గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు సరెండర్ అవుతున్నారు. గురువారం జిల్లా ఎస్పీ ముందు 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. ఆపరేషన్ చెయూత కార్యక్రమానికి ఆకర్షితులై అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు మొగ్గు చూపుతున్నారని అన్నారు. వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 12 మంది మావోయిస్టులు. జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఇందులో తొమ్మిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉండగా. వీరి వద్ద నుంచి 12 ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసులు, మరియు సీఆర్పిఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసిల అభివృద్ధి, సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై మావోయిజాన్ని వీడీ జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు సాయుధ దళాల సంచారం తెలంగాణ, చతీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నదని సరిహద్దు గ్రామ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టు దళాలకు సహకరించకూడదని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా 2025 జనవరి నుంచి నేటి వరకు వివిధ కేడర్లలో పని చేస్తున్న 294 మంది మావోయిస్టులు నింగి పోయినట్లు తెలిపారు. ఎవరైనా లొంగిపోదలుచుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్, లేదా బంధువుల ద్వారా గాని, నేరుగా అధికారుల ను సంప్రదించి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా ఎస్పీ కోరారు.
