గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : ఆళ్లపల్లి మండలంలోని రేగళ్ల రేంజ్ పరిధిలో బుసరాయి గ్రామానికి చెందిన లచ్చు, వెంకటేష్ అనే వ్యక్తులు గత నెల అడవి జంతువులను వేటాడిన కేసులో గురువారం బెయిల్ మంజూరైందని రేగళ్ల రేంజర్ జశ్వంత్ తెలిపారు. నిందితులకు 45 రోజుల తరువాత రూ.20వేల పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. అడవి జంతువులను వేటాడితే చట్టపరమైన చర్యలు తప్పవని జస్వంత్ హెచ్చరించారు.
Post Views: 54