రాహుల్ గాంధీ ..రేవంత్ ఎక్కడికి పారిపోయారు. ?
విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనలో కదం తొక్కిన నిరుద్యోగులు .
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికింది. ఆ ఊసే మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ‘చేయి’చ్చింది. 2024లో హడావిడిగా ప్రక టించిన క్యాలెండ ర్‌లో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయక ఎస్సీ రిజర్వేషన్ సాకుతో దాన్ని మూలన పడేసింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తమ ఖాతాలో వేసుకొని మభ్యపెట్టిం ది. నిరుద్యోగులను డైవర్షన్ చేసేందుకు రాజీవ్ యువ వికాసం పథకం పెట్టి అదీ ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగిన యువత.. ఈ సందర్భంగా యువతి మాట్లాడుతూ..రెండు సంవత్సరాల నుండి మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకో అని బలవంత పెడుతుంటే. జాబ్ వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను.ఇప్పుడు జాబ్ ఏమైంది అని మా ఇంట్లో వాళ్ళు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి.మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము.మా నిరుద్యోగ యువత ఓట్లు వేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనలో కదం తొక్కిన నిరుద్యోగులు.
విద్యార్థులు ఉద్యోగాలు వద్దంటున్నారని కట్టు కథ అల్లుతున్నారు .
కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలని మేమె ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పుకోడం సిగ్గుచేటు
రేవంత్ రెడ్డి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే నమ్మి ఓట్లు వేసినం రెండు సార్లు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఆం ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు ఇప్పటినుండి రేవంత్ రెడ్డిని గద్దె దింపడమే మా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం మమ్మల్ని రోడ్లపైకి తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ని స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా శ్రీ ఓడిస్తాం మేము ఓటు వేసినందుకైనా మాకు న్యాయం చేయండి కొత్త గ్రూప్ నోటిఫికేషన్లతో పాటు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని నిరుద్యోగుల డిమాండ్