పోడు భూముల రగడ.

⇒ ఫారెస్టు అధికారులు, గిరిజనుల మధ్య వాగ్వాదం, తోపులాట.

⇒ దాడి చేసి పోడు సాగుదారుల  సెల్ ఫోన్లు లాక్కున్న అధికారులు.

 గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం:  పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో నిత్యం ఏదో ఒక చోట గిరిజనులు, అటవీశాఖ అధికారుల ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పోడు భూముల వ్యవహారంలో బూర్గంపాడు మండలంలో మంగళవారం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటవీశాఖ ఆధ్వర్యం లో పోడు, అటవీ భూముల్లో ఫారెస్టు అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని విధిగా చేపట్టారు. అందులో భాగంగా బూర్గంపాడు మండలం ఇరవెండి  గ్రామపంచాయతీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. భూమినే నమ్ముకుని గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నా పోడు భూములలో మొక్కలు నాటడానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఓ ఫారెస్ట్ అధికారి  మమ్ముల్ని  అడ్డుకుంటారా అని అనుగ్రహించి  మహిళలు అని చూడకుండా, వారి బట్టలు చింపేసి విచక్షణ రహితంగా దాడి చేసినట్లు పోడు సాగుదారులు తెలిపారు.

బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు  మండలం ఇరవెండి గ్రామపంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న గిరిజనులు ప్రతి ఏట  సీజన్లో పోడు భూములు సాగు  చేసుకుంటూ అదే జీవనోపాధిగా గత 30 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొంత భూమి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులు చేస్తూ మహిళలు ముసలివారు చిన్నపిల్లలు అని చూడకుండా ఇస్తాను సారంగా ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇదే క్రమంలో శుక్రవారం అటవీశాఖ అధికారులు వచ్చి తమకు చెందిన పోడు భూముల్లో మొక్కలు నాటుతున్నారు. తాము సాగు చేసుకుంటున్న భూము ల్లో మొక్కలు నాటొద్దని, తాము సాగుచేసిన పంటలను నాశనం చేయొద్దని గిరిజన రైతులు అటవీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో  ఆగ్రహించిన అటవీశాఖ అధికారులు మమ్ములనే  అడ్డుకుంటారా  అని గిరిజన మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ విషయంపై సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు వినతి పత్రం అందజేశారు. ఆదివాసీలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అమాయక గిరిజన పోడు సాగుదారులపై దాడికి పాల్పడిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలనిగిరిజన సేవక్ సంఘ్ జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి రాష్ట్ర యువజన అధ్యక్షులు (GSS) అరేం ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఆదివాసి బిడ్డలకు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాడులకు పాల్పడడం దారుణం అన్నారు. ఆదివాసి మహిళలపై దాడికి పాల్పడిన  అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram