టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. క్వారీ యజమానిని డబ్బులు డిమాండ్ చేసిన కేసులో అరెస్ట్ చేసినట్లు సమాచారం. మనోజ్ అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో.. కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వరంగల్ లోని సుబేదారి పోలీస్ స్టేషన్ తరలించారు. కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 308 (2), 308 (4), 352 3  చేశారు. ఉదయం కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించనున్నారు.తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు కౌశిక్ రెడ్డి. కానీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీలసులు అరెస్టు చేశారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు కౌశిక్ రెడ్డి.

సుబేదారి పీఎస్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని  హైకోర్టు ను ఆశ్రయించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి చుక్కెదురయింది. కమలాపురం మండలం వంగపల్లిలో ఉన్న క్వారీని మనోజ్ నిర్వహిస్తున్నాడు. అయితే తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టివేయాలని ఏప్రిల్ లో పిటిషన్ దాఖలు చేయగా.. మంగళవారం (జూన్ 17) విచారించిన కోర్టు.. దానిని కొట్టివేసింది. గతంలో ఇదే కేసులో అరెస్ట్ పై స్టే ఇచ్చిన కోర్టు.. దర్యాప్తుకు సహకరించాని ఆదేశించింది.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram