గోల్డెన్ న్యూస్/ అశ్వాపు : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం లో మత్తు పదార్థాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ..మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యానికి హానికరమని. కుటుంబ కలహాలకు కారణమని, మత్తు పదార్థాల వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతారని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ను మత్తుకు బానిసలు కాకూడదని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమం జూన్ 20 నుంచి 26 వరకు ఆంటీ డ్రగ్ అవేర్నెస్ సదస్సులు . నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Post Views: 17