తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రతినెలా వారికి రూ.2016 పెన్షన్

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ :తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తాంది రేవంత్ సర్కార్. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రవేశ పెట్టింది. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా పథకాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. డయాలసిస్, హెచ్ఐవీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందజేయాలని నిర్ణయించింది. మే నెలలో 4021 మంది డయాలసిస్ బాధితులకు పింఛన్లు మంజూరు అయ్యాయి. త్వరలోనే వారికి నెలకు రూ.2016 చొప్పున సహాయం అందించనున్నారు.

13 మంది హెచ్ఐవీ బాధితులు పెన్షన్ కోసం దరఖాస్తు చేయగా, అధికారులు వారి దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram