ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు.
గోల్డెన్ న్యూస్ / వరంగల్ : ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ద్వారా జరిమానాలకు గురైన ఓ వాహనదారుడు వాటిని చెల్లించకుండా రోడ్లపై తిరుగుతూ.. శనివారం కాజీపేట ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు.కాజీపేట ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ వెంకన్న తన సిబ్బందితో కలసి కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీలో చేస్తుండగా హన్మకొండ ప్రాంతానికి చెందిన అస్లం అనే వ్యక్తి వాహనానికి సంబందించి పెండింగ్ చలాన్లు తనిఖీ చేయగా ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లను పెండింగ్ లో ఉన్నాయి ఈ చలాన్లు మొత్తం 45,350/- కావడంతో జరిమానా మొత్తం చెల్లించే వరకు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు
Post Views: 38