తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు

 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ముఖ్యంగా మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

 

ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులను కూడా వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జూన్ 24న వీటికి అదనంగా నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షాలు పడే చాన్స్ ఉందంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున.. ప్రజలు చెట్ల కింద వల్ల రాదని సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని తెలిపారు.

 

హైదరాబాద్ నగరంలో నేడు ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. నగరంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.

ఈ సారి మే 27నే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ వర్షాలు మాత్రం ఆశాజనకంగా లేవు. జూన్ మొదటి వారంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.. సోమవారం నుండి చిరుజల్లులు పడటంతో  వాతావరణం కాస్త చల్లబడింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు. ఆనందపడుతున్నారు. దీంతో వారు విత్తనాలు పెట్టేందుకు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram