మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

గోల్డెన్ న్యూస్/ మణుగూరు : తరగతి గదుల్లో విద్యార్థులకు విద్యాబోధనతో పాటు మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పించాలని స్థానిక డి.ఎస్.పి రవీందర్ రెడ్డి, సి ఐ నాగబాబు సూచించారు. మారకద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మణుగూరు కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులతో సోమవారం మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై మత్తులో తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఎస్సై మెడ ప్రసాద్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram