భూములు లాక్కోవొద్దని అడిగినందుకు ఫారెస్టు అధికారులు మా పై దాడి చేశారు.
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : భూములు లాక్కోవొద్దని అడిగినందుకు ఫారెస్టు అధికారులు మా బట్టలు చింపి ప్యాంటు జిప్పు తీసి చూపించారు.దాడి చేయకుండా ఉండాలంటే డబ్బులు అడిగారు, 30 కుటుంబాలకు కలిపి రూ.60 వేలు వసూలు చేసి ఇస్తే, ఆ డబ్బులతో బీర్లు, నాటు కోళ్లు తెచ్చుకొని మా పొలం వద్దనే పార్టీ చేసుకున్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన మహిళలపై జరిగిన దాడిలో సంచలన విషయాలు బయటపెట్టిన మహిళలు .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం ఇరవెండి పంచాయతీ పరిధిలో ఆదివాసీ మహిళలపై ఈ నెల 20న అటవీ శాఖ అధికారులు చేసిన దాడిలో తమపై జరిగిన ఆకృత్యాల గురించి సంచలన విషయాలు తెలిపిన ఆదివాసీ మహిళలు
ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న భూములని, తమను ఖాళీ చేయించడం సరికాదని బతిమాలినా వినకుండా, అటవీశాఖ అధికారులు తమను బూటు కాలితో తన్ని, నైటీలు చింపేసి, ప్యాంటు జిప్పు తీసి చూపించి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన ఆదివాసీ మహిళలు
డబ్బులు వసూలు చేసిన మూడు రోజులకు తిరిగి వచ్చి మళ్లీ దాడి చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆదివాసీ మహిళలు
మా సంకలో పిల్లలు ఉన్నారని, ఈ మధ్యే ఆపరేషన్ చేసుకున్నామని, కాళ్లు మొక్కినా వినకుండా దాడి చేశారని తెలిపిన ఆదివాసీ మహిళలు
వారి భర్తలు పనికి వెళ్లిన సమయంలో ఆడవాళ్లపై ఎలా దాడి చేస్తారని ప్రశ్నించి, వీడియో తీస్తున్న అంగన్వాడీ టీచర్ పై కూడా దాడి చేసి, ఆమెని బెదిరించారని తెలిపిన మహిళలు
సంకలో బాబు ఉన్నాడని చెప్పినా వినకుండా, బాబుని తోసేసి తనను బూట్లతో తన్నారని ఆరోపించిన మడకం నందిని అనే మహిళ
తన రెండు చేతులు వెనకకి విరిచి మరీ కొట్టారని, తన కొడుకుని తోసేసారని ఆరోపించిన కుంజా జోగమ్మ అనే మహిళ
మా భూములు లాక్కోవద్దని అడగడంతో, ఒక ఫారెస్ట్ అధికారి ప్యాంటు జిప్పు తీసి చూపించాడని ఆరోపించిన తాటి లక్ష్మీ అనే మహిళ
ఆదివాసీలమని, పేద ప్రజలని ఎవరూ పట్టించుకోరనే ధైర్యంతో ఫారెస్ట్ అధికారులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారని కంటతడి పెట్టుకున్న ఆదివాసీ మహిళలు.
Post Views: 23