మెదక్ జిల్లాలో దారుణం
గోల్డెన్ న్యూస్ / మెదక్ : మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోట చేసుకుంది. జిల్లాలోని హావేలి ఘనపూర్ మండలం ఔరంగబాద్ తండాలో రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని కొడవలితో తండ్రి నాలుక కోసేశాడు కసాయి కొడుకు. ఔరంగాబాద్ తండాకు చెందిన బానోత్ కీర్యా అనే రైతుకు ఎకరం భూమి ఉండగా ఖాతాలో రూ.6000 రైతు భరోసా జమ అయినవి.
రైతు భరోసా డబ్బు ఇవ్వమని తన చిన్న కొడుకు సంతోష్ అడగడంతో, ఆరోగ్యం బాగాలేక రూ.2000 ఖర్చు చేశానని మిగతా రూ.4000 ఇస్తానని చెప్పిన తండ్రి కీర్యా.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యి, తండ్రిని కొట్టడమే కాకుండా గొడ్డలితో నాలుక కోసేసిన సంతోష్ .
తీవ్ర రక్తస్రావం కావడంతో కీర్యాను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి, అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
Post Views: 24