త్వరలో ‘రాజీవ్ యువ వికాసం’ అమలు?
గోల్డెన్ న్యూస్/హైదరాబాద్ : రాష్ట్రంలోని యువత ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందా అని ఎదురు చూస్తోంది. ఈ స్కీమ్ను ఈనెల 2న ప్రారంభించాల్సి ఉండగా వాయిదా పడింది. అయితే మంగళవారం జరిగిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో సీఎం రేవంత్ దీనిపై స్పష్టత ఇచ్చారు. ‘రైతు భరోసా’ పూర్తవడంతో రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసం పథకంపై దృష్టి పెడతామని చెప్పారు. ప్రణాళికలు రూపొందించుకుని వచ్చి యువతకు న్యాయం చేస్తామని తెలిపారు.
Post Views: 18