పాఠశాల ఆవరణ ఇంత ఆపరిశుభ్రమా. ?

 డ్రైనేజీగా మారిన రావిగూడెం ప్రాథమిక పాఠశాల

గోల్డెన్ న్యూస్/ పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల ఏడూళ్ళ బయ్యారం పరిధిలోని రావిగూడెం బీసీ ప్రాథమిక పాఠశాల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా తయారవుతుంది పాఠశాల నిర్మించి  20 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రహరీ గోడకు నోచుకోలేదు. గోడ లేకపోవడంతో వర్షం కాలం వరద నీరు పాఠశాల ఆవరణలోకి చేరి బురద మయంగా మారుతుంది. పాఠశాలకు విద్యార్థులను ఎలా పంపాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలోకి వెళ్లలేని దుస్థితి. గోడ లేకపోవడం వల్ల ఆవరణలోనే పశువులు సైర విహారం చేస్తుంటాయి. పాఠశాల ఆవరణలో వారాల తరబడి నీరు నిల్వ ఉంటూ విషపురుగుల కు ఆవాసంగా మారుతోంది. విద్యార్థులు ఆదమరిస్తే ప్రమాదం ముంచుకొస్తుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు  ఆందోళన చెందుతున్నారు అధికారులు స్పందించి డ్రైనేజీలను ఏర్పాటు చేసి నీటిని బ యటకు పంపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram