గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లందు సీఐను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసిన మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. భార్య భర్తల మధ్య వివాదం కేసులో భర్త తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించి వారి హక్కులకు భంగం కలిగించినందులకు గాను మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ ఇల్లందు సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసారు.
పోలీసు అధికారులు గానీ,సిబ్బంది గానీ ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో అమర్యాదగా ప్రవర్తిస్తే శాఖా పరమైన విచారణ జరిపి క్రమశిక్షణా చర్యలు తప్పవని ఈ సందర్బంగా తెలియజేసారు.మరింత సమాచారం తెలియల్సి ఉంది..!!
Post Views: 28