గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కరకగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని అనంతరం గ్రామంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవగాహన కార్యక్రమం బుధవారం చేపట్టారు. అనంతారం గ్రామంలో ప్రధాన రహదారిపై స్థానిక యువత,గ్రామస్తులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాలు వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ నినాదాలు చేశారు. స్థానిక ఎస్ఐ పీవీ నాగేశ్వరావు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లుకు దూరంగా ఉండాలని సూచించారు. చదువుపై శ్రద్ధ వహించి జీవితాలను ఆనందమయం చేసుకోవాలని అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 17