ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వరుసతులు కల్పించాలి

ఎన్ని ప్రభుత్వాలు మారినా తీరని డోలీ మోతలు

వలస ఆదివాసి ప్రజలను ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు.

 ఆదివాసీ ప్రజల్లో వెలుగు నింపని ప్రభుత్వాలు

     – సీపిఎం డిమాండ్.

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం :వలస ఆదివాసిలకు డోలీ మోతల కష్టాలు తీరనీ వ్యథ గానే కొనసాగుతున్నాయని సీపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరం కాంతారావు విమర్శించారు వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనీ వారు తీవ్రంగా దయబెట్టారు వారిని ఓటు బ్యాంకు గానే చూస్తున్నారనీ వారికి కనీస సౌకర్యాలు విద్యా, వైద్యం లాంటివి కూడా తీరని మిథ్య గానే కొనసాగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు 30 సంవత్సరాల క్రితం పొట్ట చేత పట్టుకుని ఈ ప్రాంతానికి వలస వచ్చి స్థిర జీవనం కొనసాగిస్తున్నారు అయినా వారు ఈ దేశ పౌరులేననీ వారన్నారు వారికీ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం లో తీవ్రంగా వివక్షత చూపుతున్నారనీ వారు వాపోయారు తక్షణమే ఆయా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు

Facebook
WhatsApp
Twitter
Telegram