కష్టం తీరుస్తుందనుకున్నాడు.. కాటికి చేర్చే వరకు తెస్తుందని గమనించలేకపోయాడు.. లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి
గోల్డెన్ న్యూస్ / కరీంనగర్ : బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ గేమ్స్‌కు అలావాడు పడి అప్పులపాలై..
అవి తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుతూనే ఉంది.
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన రాజయ్య – లక్ష్మీ దంపతుల కుమారుడు అయిన అఖిలేష్
బిటెక్‌లో ఫెయిలై ఇంటి వద్ద ఉంటూ పరిక్షలకు ప్రిపేర్ అవుతున్న యువకుడు లోన్ యాప్స్‌కు బలయ్యాడు.
లోన్ యాప్ వేధింపులు భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Post Views: 31