మంత్రి సీతక్కకు మావోయిస్టుల వార్నింగ్

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి సీతక్కపై మావోయిస్టులు మండిపడ్డారు. ఆమెకు వార్నింగ్ ఇస్తూ.. లేఖ విడుదల చేశారు. ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా.. మంత్రి సీతక్క మౌనంగా ఉండడంపై వారు అసహనం వ్యక్తం చేశారు.

గోల్డెన్ న్యూస్ /ములుగు : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని విమర్శించిన మావోయిస్టులు

 

కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా, 1/70 చట్టాలను మంత్రి సీతక్క మరచిపోయారా…? అంటూ మండిపాటు

 

రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని స్పష్టం చేసిన మావోయిస్టులు

 

జీవో నెంబర్. 49తో కుమురం భీమ్ జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని.. జీవో కారణంగా రాష్ట్రంలో మూడు జిల్లాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన మావోయిస్టులు

 

జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

Facebook
WhatsApp
Twitter
Telegram