గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : భాజపా రాష్ట్ర అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే రోజు అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. భాజపా (BJP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. జులై 1న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది.భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. జూలై 1వ తేదీన పార్టీ నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. 30వ తేదీన నామినేషన్ స్వీకరణ.. అదే రోజు సాయంత్రంలోపు ఉపసంహరణ ఉంటుందని తెలిపారు.
