విశాఖ ఎక్స్ ప్రెస్ లో దొంగలు హల్ చల్ . దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

గోల్డెన్ న్యూస్ /ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లపిడుగురాళ్ల మండలంలో విశాఖ ఎక్స్ ప్రెస్ లో దుండగులు చోరీకి యత్నించారు. తుమ్మల చెరువు వద్ద రైలు నడుస్తుండగా వారు కోచ్లలోకి చొరబడి ప్రయాణికుల వద్ద డబ్బు, నగలు దొంగిలించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు స్పందించి గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జూన్ 28 రాత్రి జరిగింది.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram