⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం
⇒ శీతలపానీయం అనుకొని పురుగు మందు తాగిన బాలుడు. పరిస్థితి విషమం.
⇒ నీలోఫర్ పిల్లల ఆసుపత్రికి తరలింపు
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం :శీతల పానీయం అనుకొని పురుగు మందు తాగిన ఓ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని చొప్పల గ్రామానికి చెందిన జాడి నవీన్ వరలక్ష్మి దంపతుల కుమారుడు ఐదేళ్ల వరుణ్ తేజ ఆదివారం ఉదయం ఇంట్లో ఆడుకుంటూ.. ఇంట్లో సీసాలో ఉన్నది శీతల పానీయం అనుకొని పురుగు మందు తాగాడు 1 గంటల తరువాత అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబీకులు ఆటోలో కరకగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి 108 ద్వారా మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ నిలోఫర్ పిల్లల ఆసుపత్రికి తరలింపు.