ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం .

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : శంషాబాద్  పరిధిలోని ఓఆర్ఆర్ పై  రోడ్డుపై జరిగిన ప్రమాదంలో  వరుసగా 10 కార్లు  ఒకదానినొకటి ఢీకొన్నాయి.  ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి చెన్నమ్మ హోటల్ సమీపంలో  చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అందులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఓ కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్లి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక వస్తున్న 10 కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో 2 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు

Facebook
WhatsApp
Twitter
Telegram