సొంతవారే చేయి అందించని వేల అన్నీ తామే అయ్యి వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మనకోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులు అందరికీ
డాక్టర్స్ డే శుభాకాంక్షలు
గోల్డెన్ న్యూస్/ ఈ విశ్వంలో వైద్యవృత్తి ఓ మహోన్నతమైనది. తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడు.. తన కష్టనష్టాలను పక్కనబెట్టి రోగుల సేవలో నిమగ్నమవతారు.. అత్యవసర పరిస్థితుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి నమ్ముకొని వచ్చిన వారిని రక్షిస్తారు. అందుకే మన పెద్దలు వైద్యో నారయణోహరి అన్నారు. అన్ని వృత్తుల కంటే వైద్యవృత్తి పరమ పవిత్రమైనది. సమాజంలో వైద్యుల పాత్ర చాలా కీలకమైనది. విపత్కర పరిస్థితుల్లో కూడా వారు అందించే సేవలు అమోఘమైనవి. గతంలో అనేక వ్యాధులు, రోగాల బారి నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించారు. మన కళ్ళ ముందే వీర విహారం చేసిన కరోనా వైరస్‌ను కూడా వైద్యలోకం సమర్ధవంతంగా ఎదుర్కొని మానవ జాతికి ఉపశమనం కలిగించారు. ఇలాంటి అనేక సందర్భాల్లో తమ సేవలందించి మానవ మనుగడను సురక్షితంగా ముందుకు నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి సేవలను గుర్తు చేసుకొని గౌరవించేందుకు ఏటా జూలై 1న వరల్డ్ డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. వృత్తికే అంకితమై, కనిపించే దేవుళ్లుగా సేవలందిస్తున్న వైద్యులకు శుభాకాంక్షలు!