తెలంగాణ బీజేపీ అధ్యకుడిగా ఎన్. రామచందర్ రావు !

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : నాయకులు, కార్యకర్తల త్యాగాల ఫలితమే భాజపా ఈ స్థాయికి వచ్చిందని ఆ పార్టీ తెలంగాణ నూతన అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నూతన అధ్యక్షుడు మాట్లాడారు.. ఎంతమంది కార్యకర్తలు, నేతల కృషి ఫలితమే పార్టీ ఈ స్థాయిలో ఉందని అన్నారు. ఎర్రకోటపై కోటపై కాషాయ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ తదితరులు నాయకత్వంలో వారి సహకారంతో ముందుకెళ్తామన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భాజపా అవతరించిందని . అలాంటి  పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు అయినందుకు సంతోషంగా ఉందన్నారు. నన్ను తెలంగాణ అధ్యక్షుడిగా  ప్రకటించడం గర్వంగా భావిస్తున్నాను అన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram