బాలుడి వైద్య ఖర్చులకు ఎస్ఐ రాజ్ కుమార్ ఆర్థిక సాయం

శీతల పానీయం అనుకొని పొరపాటున పురుగుల మందు తాగిన బాలుడికి రూ.4 వేలు ఆర్థిక సహాయం అందజేసిన ఎస్ఐ రాజ్ కుమార్.

 

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : కరకగూడెం మండలం చొప్పాల గ్రామానికి చెందిన జాడి నవీన్ కుమారుడు వరుణ్ తేజ్ (4) శనివారం ఉదయం శీతల పానీయం అనుకొని పొరపాటున పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం హైదరాబాదులో చికిత్స పొందుతున్నాడు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న  ఎస్ఐ రాజ్ కుమార్ బాలుడి వైద్య ఖర్చులకు బుధవారం ఫోన్ పే ద్వారా రూ. 4 వేల ఆర్థిక సహాయం అందజేశారు. తమ సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి తమ కుమారుడి వైద్య ఖర్చులకు సహాయం అందించినందుకు ఎస్సై రాజ్ కుమార్ కు నవీన్ ధన్యవాదాలు తెలియజేశారు. గతంలోనూ రాజ్ కుమార్ చాలామందిని ఆర్థికంగా ఆదుకొని మానవత్వం చాటుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram