ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ జితేష్ వి పాటిల్.

 

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు.  వర్షాల కారణంగా ఏ విధమైన ఆస్తి నష్టం కలగకుండా అధికారులు హెడ్ క్వార్టర్ లోనే ఉండి పర్యవేక్షించాలని తెలిపారు. వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా వాగులు, చెరువులు పొంగిపొర్లే అవకాశం ఉంది. రోడ్లపైకి నీరు చేరే పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, బయటకు రావాల్సి వస్తే అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా అధికారులు మరియు సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు.

సెల్ఫీలు తీసుకోవడానికి పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు లోనుకావద్దని ఆయన సూచించారు.

 

విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు తక్షణమే జిల్లా కలెక్టరేట్‌లో.

లేదా ఆర్డీవో కార్యాలయాల్లో ……ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లకు, లేదా తమ మండల తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు కాల్ చేసి సమాచారం అందించి సహాయం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.

 

జిల్లా అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు మరియు అన్ని మండల అధికారులు అప్రమత్తంగా ఉండి, వర్షాల కారణంగా ఏర్పడే పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో సంబంధిత రెవెన్యూ, పోలీసు, రోడ్లు, మున్సిపల్ మరియు పంచాయతీ శాఖలతో సమన్వయం చేసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

 

ప్రస్తుతం పడుతున్న వర్షాల సందర్భంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండటాన్ని అలవాటుగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సమయంలో వర్షాలకు తీసుకునే ముందు జాగ్రత్తలు, అప్రమత్తత చర్యలు రాబోయే గోదావరి వరదల సమయంలో కూడా ఉపయోగపడతాయని, ఎప్పుడైనా వచ్చే వరదలకు సకాలంలో స్పందించడానికి అధికారులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే విధంగా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

 

ప్రమాదాలను నివారించడానికి అధికారులు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

[7/2, 4:37 PM] Azgar Hussain: 08744 -241950 @ IDOC Bhadradri Kothagudem

08743 – 232444 @ Sub Collector, Office, Bhadrachalam

9347910737 for WhatsApp @ Sub Collector, Office, Bhadrachalam

9392919747 for WhatsApp @ @ IDOC Bhadradri Kothagudem

Facebook
WhatsApp
Twitter
Telegram